: రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరిన టీడీపీ ఎంపీలు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీల దర్యాప్తు పక్కదోవ పడుతోందని వివరించేందుకు టీడీపీ ఎంపీలు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరారు. ఈ మేరకు రేపు కలిసేందుకు అనుమతించాలని రాష్ట్రపతి భవన్ కు లేఖ రాశారు. కాగా, జగన్ కేసులో దాదాపు 43వేల కోట్ల అవినీతి జరిగిందని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం హడావుడిగా అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో జగన్ కు బెయిల్ వచ్చే పరిణామాలు కనబడుతున్నాయి. మరోవైపు, ఈడీ విచారణ ముందుకు సాగడంలేదు. దీనింతటికీ కారణం కాంగ్రెస్, వైఎస్సార్సీపీ కుమ్మక్కై జగన్ అవినీతిని పక్కదారి పట్టించడమేనని రాష్ట్రపతికి టీడీపీ ఎంపీలు ఓ వినతిపత్రాన్ని కూడా సమర్పించనున్నాయి.