: విజయవాడలో నేడు 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ


విజయవాడ వేదికగా సమైక్యవాదాన్ని నలుదిక్కులా వినిపించేందుకు ఏపీఎన్జీవోలు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణే ధ్యేయంగా 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరిట భారీ సభను ఈ రోజు విజయవాడలో నిర్వహించనున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్రం ముక్కలైతే తలెత్తే పరిణామాలను వివరించేందుకు ఈ సభలో మేధావులచేత మాట్లాడించనున్నారు. అంతే కాకుండా ఉద్యమంలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు గడపకొక్కరు రావాలని ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు.

సభా ప్రాంగణానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి 'బూర్గుల రామకృష్ణారావు' పేరును పెట్టారు. హైదరాబాద్ లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సక్సెస్ కావడంతో... ఈ సభపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ బహిరంగ సభకు దాదాపు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సమైక్య ఉద్యమాన్ని ఎన్నిరోజులైనా కొనసాగించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ సభ దోహదపడుతుందని నాయకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News