: వీపునొప్పికి కొత్తవైద్యం
మీరు వీపు దిగువభాగంలో మెలితిప్పేలాంటి నొప్పితో బాధపడుతున్నారా... అయితే మీరు ఉప్పుతో చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చట. ఈ విషయాన్ని పరిశోధకులు ప్రత్యేకంగా చెబుతున్నారు. వీపు నొప్పికి ఉప్పు మంచి ఉపశమనాన్ని కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నొప్పి తగ్గించేందుకు ఉపయోగించే స్టెరాయిడ్ వల్ల దీర్ఘకాలంగా పెద్ద ప్రయోజనం కలగకపోవచ్చని, కానీ ఉప్పు సూదిమందుతో కొంతమేర ఉపశమనాన్ని పొందవచ్చని జాన్‌హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
ఇలాంటి నొప్పితో బాధపడేవారికి ఉప్పు చక్కగా పనిచేస్తుందని వారి విశ్లేషణలో తేలింది. ఇలాంటి నొప్పితో బాధపడేవారికి నొప్పి తెలియకుండా చేసే స్టెరాయిడ్‌ను సూదిమందుగా ఇవ్వడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలేవీ ఉండకపోవచ్చని, అయితే స్టెరాయిడ్‌కంటే కూడా ఉప్పుసూదిమందు మంచి ప్రభావాన్ని చూపవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే స్టెరాయిడ్‌ను మానేయాల్సిందిగా తాము సూచించడం లేదని, కేవలం ఉప్పులోని సుగుణాలను మాత్రమే చెబుతున్నామని, దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉందని వారు చెబుతున్నారు.