: 'లైఫ్ ఆఫ్ పై' బృందాన్ని సత్కరించనున్న పుదుచ్చేరి ప్రభుత్వం
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాల్లో నాలుగింటిని కైవసం చేసుకున్న 'లైఫ్ ఆఫ్ పై' చిత్ర బృందాన్ని సత్కరించాలని పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రభుత్వం భావిస్తోంది. ఈ హాలీవుడ్ చిత్రం ఎక్కువ భాగం పుదుచ్చేరి పరిసరాల్లోనే షూటింగ్ జరుపుకుంది.
దీంతో, ఆ చిత్ర దర్శకుడు ఆంగ్ లీ, కథానాయకుడు సూరజ్ తదితరులను ఘనంగా సన్మానించాలని పుదుచ్చేరి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సన్మానంతో అంతర్జాతీయంగా పుదుచ్చేరి పేరు వార్తల్లోకెక్కుతుందని, తద్వారా పర్యాటకులను ఆకర్షించడం సులువని ఇక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది.