: రెజ్లింగ్ ను ఒలింపిక్స్ లో చేర్చరూ..!: ఐఓసీకి క్రీడల మంత్రి లేఖ
పురాతన క్రీడ రెజ్లింగ్ ను మళ్లీ ఒలింపిక్స్ లో చేర్చాలని భారత క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి ఓ లేఖ రాశారు. 2020 ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్ ను తొలగించాలన్న ఐఓసీ కార్యనిర్వాహక వర్గ నిర్ణయాన్ని పున:సమీక్షించాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఐఓసీ అధ్యక్షుడు జాక్వెస్ రోగేను ఉద్దేశిస్తూ.. తొలగించిన 25 క్రీడల జాబితా నుంచి రెజ్లింగ్ కు మినహాయింపు ఇవ్వాలని జితేందర్ సింగ్ లేఖలో అభ్యర్థించారు.