: సెమీస్‌లో ముంబైతో తలపడాలని..


'సెమీస్ లో ముంబై జట్టుతో తలపడాలని ఉంది'.. ఇది రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిలాష. సచిన్ గొప్ప ఆటగాడే అని అంగీకరిస్తూనే, చాంపియన్స్ లీగ్ తొలి పోరులో 21న ముంబైతో తలపడడాన్ని ప్రత్యేక దృష్టితో చూడడం లేదని తెలిపాడు. సచిన్,తాను.. ప్రత్యర్థులుగా, ఒకే జట్టు సభ్యులుగా ఎన్నో మ్యాచ్‌లు ఆడామని గుర్తు చేశాడు. అతను నిజంగా గొప్ప ఆటగాడే అని కొనియాడాడు. 'శనివారం ముంబైతో మ్యాచ్ మాకు సవాలుతో కూడుకున్నదే. కానీ ఎలాంటి ప్రత్యేకతా లేదు'అని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌ను ఇరు జట్ల మధ్య సమరంగానే చూస్తున్నామని రాహుల్ తెలిపాడు. ఐతే సెమీస్‌లో మా జట్టు ముంబైతోనే తలపడాలనేది తన కోరికని ద్రవిడ్ అన్నాడు. ఈ సీఎల్‌టీ-20నే చివరిదా? అని అడగగా వచ్చే ఏడాది ఆడాలో లేదో అనేది ఇంకా నిర్ణయించుకోలేదని అన్నాడు. ఇప్పటికైతే ఈ టోర్నీపైనే పూర్తిగా దృష్టినిలిపానని మిస్టర్ డిపెండబుల్ అన్నాడు.

  • Loading...

More Telugu News