: ముజఫర్ నగర్ అల్లర్ల బాధితులకు ప్రత్యేక పెన్షన్


ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటుచేసుకున్న అల్లర్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ ఇవ్వనుంది. 'రాణి లక్ష్మీ బాయ్ పెన్షన్ పథకం' కింద వారికి ఈ పెన్షన్ ఇవ్వనున్నారు. చనిపోయిన, గాయపడ్డవారి కుటుంబాలకు నెలకు నాలుగు నుంచి ఐదు వందల రూపాయలు ఇవ్వనున్నట్లు ఓ అధికారి తెలిపారు. అంతేగాక చనిపోయినవారి కుటుంబంలోని వారికి అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలని ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం యూపీ అధికారులు ఓ జాబితాను కూడా తయారుచేస్తున్నారు. ఈనెల 7న జరిగిన ఈ అల్లర్లలో 48 మంది మరణించగా, వందలమందికి గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News