: సిరియాలో పేలుళ్లు
సిరియా మరోసారి రక్తసిక్తమైంది. ఈ రోజు జరిగిన పేలుళ్లలో 19 మంది మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. పేలుడు పదార్థాలు అమర్చిన రెండు బస్సులు, ఓ కారును గుర్తు తెలియని దుండగులు పేల్చివేయడంతో ఈ ఘటన జరిగింది. సిరియాలోని హామ్స్ రాష్ట్రంలో జబురిన్, అక్రాద్ అల్ డఫ్నీ పట్టణాల మధ్య ఈ దారుణం జరిగిందని ప్రభుత్వ అనుకూల మీడియా తెలిపింది. అయితే ఈ సంఘటనకు కారణం ఎవరన్నది తెలియరాలేదు.