: చీటీల పేరిట కోటికి టోకరా.. మహిళ అరెస్టు
మధ్య తరగతి ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఓ మహిళ చీటీల పేరిట రూ. కోటి మేర దండుకుని మోసం చేసింది. హైదరాబాదు చైతన్యపురిలో విజయలక్ష్మి అనే మహిళ చీటీల పేరుతో పలువురి నుంచి డబ్బులు వసూలు చేసింది. అయితే, తిరిగి చెల్లించడంలో ఆమె మోసపూరితంగా వ్యవహరించడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, చైతన్యపురి పోలీసులు సదరు మహిళను అరెస్టు చేశారు.