: ఎల్లుండి ఢిల్లీకి చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 21న ఢిల్లీకి వెళుతున్నారు. అక్కడ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లను, ఇతర పార్టీల నేతలను ఆయన కలవనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలంటూ ఈ సందర్భంగా బాబు కోరనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట పార్టీకి చెందిన సీమాంధ్ర, తెలంగాణ నేతలు, పార్టీ పార్లమెంటు సభ్యులు కూడా ఉంటారు.