: కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబు అరెస్ట్
కర్ణాటకలోని కంప్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సురేష్ బాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బెళికెరె ఓడరేవు నుంచి ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారన్న కేసులో ఆయనను అరెస్టు చేశారు. అరెస్టయిన సురేష్ బాబు.. మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.