: యువీ, అపరాజిత్ శ్రమ వృథా.. సిరీస్ విండీస్-ఎ కైవసం


విండీస్-ఎ జట్టుతో మూడు వన్డేల సిరీస్ లో భారత్-ఎ బోల్తా కొట్టింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో నేడు జరిగిన మూడో వన్డేలో భారత్-ఎ 45 పరుగుల తేడాతో కరీబియన్ల చేతిలో చిత్తయింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్-ఎ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో భారత్-ఎ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు కేవలం 267 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆతిథ్య జట్టులో ఓపెనర్ బాబా అపరాజిత్ (78), కెప్టెన్ యువరాజ్ సింగ్ (61) రాణించినా మిగతా బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో పరాభవం తప్పలేదు. కరీబియన్ బౌలర్లలో పెరుమాళ్ 3, కమిన్స్ 2 వికెట్లు తీశారు. కాగా, ఈ విజయంతో విండీస్-ఎ సిరీస్ ను 2-1తో గెలుచుకుంది.

  • Loading...

More Telugu News