: కేన్సర్ ను దూరంగా వుంచండి


ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో అవగాహన ర్యాలీ జరిగింది. బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు జరిగిన ఈ అవగాహన ర్యాలీని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ రోజు ఉదయం ప్రారంభించారు. కేన్సర్ వ్యాధి అంటే భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినందున సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని
సూచించారు. ఈ ర్యాలీలో నటి, నిర్మాత మంచు లక్ష్మీ, క్రీడాకారులు సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. 

కేన్సర్.. పైకి కనిపించకుండా మనిషిని లోలోపలే తినేసే మహమ్మారి. ఇటీవలి కాలంలో ఆధునిక జీవనం, కాలుష్యం పెరిగిపోవడం ఫలితంగా ఇది పెరిగిపోతోంది. ప్రతి లక్ష మందిలో 100 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సరైన అవగాహన కలిగి వుంటే కేన్సర్ ను ముందుగానే గుర్తించవచ్చని, దాంతో సత్వర చికిత్స తీసుకోవడం ద్వారా కేన్సర్ నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులకు దూరంగా వుండాలని చెబుతున్నారు.    

  • Loading...

More Telugu News