: తమిళ న్యాయవాదుల తడాఖా!


చెన్నై లాయర్లు తడాఖా చూపారు! ఏకంగా పోలీసు అధికారినే చితకబాది, తమ చాతుర్యంతో అతడినే జైలుపాలు చేశారు. వివరాల్లోకెళితే.. చెన్నైలోని రాజా అన్నామలైపురంలో సుబ్బయ్య అనే డాక్టరుకు, పొన్ స్వామి అనే ఉపాధ్యాయుడికి మధ్య స్థల వివాదం నడుస్తోంది. గత నెల 14న పొన్ స్వామి వర్గీయులు సుబ్బయ్యపై దాడి చేశారు. దీనిపై డాక్టర్ సుబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసుల భయం కారణంగా పొన్ స్వామి కుటుంబం పరారైంది. కానీ, అతని కుమారుడు ఫైజిల్ మద్రాస్ హైకోర్టులో న్యాయవాది కావడంతో కోర్టు వద్ద పోలీసు నిఘా ఏర్పాటు చేశారు.

నిఘాలో భాగంగా ఎస్ఐ శంకర నారాయణన్ కూడా కోర్టు వద్దకు వచ్చాడు. ఫైజిల్ కోర్టు ప్రాంగణంలో కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే ఆ న్యాయవాది పోలీసులపై తిరగబడ్డాడు. అతడికి సహ న్యాయవాదులు కూడా జతకలిశారు. అందరూ కలిసి శంకర నారాయణన్ ను చావబాదారు. అంతటితో ఆగకుండా హైకోర్టు రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా, తమ న్యాయపరిజ్ఞానాన్ని ఉపయోగించి తిరిగి ఎస్సై శంకర నారాయణన్ పైనే కేసులు పెట్టారు. కిడ్నాప్, బెదిరింపులు వంటి పలు సెక్షన్ల కింద ఆ ఎస్సైపై కేసులు నమోదు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరచగా, అతడికి రిమాండ్ విధించారు.

  • Loading...

More Telugu News