: సీఎల్పీ భేటీలోనూ ఆ రెండు వాదనలే!
ఈ ఉదయం హైదరాబాదులో జరిగిన సీఎల్పీ భేటీలో సీమాంధ్ర, తెలంగాణ మంత్రులు రాష్ట్ర విభజన అంశంపై చర్చించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న అభిప్రాయాన్ని తాము వెలిబుచ్చామని ఏరాసు ప్రతాపరెడ్డి అంటే.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కాగా, రాష్ట్ర విభజన జరిగితే ఉత్పన్నమయ్యే కష్టాలను తెలంగాణ నేతలకు వివరించామని ఏరాసు వెల్లడించారు. అటు, బస్వరాజు సారయ్య మాట్లాడుతూ, హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణపై నిర్ణయం అయిపోయిందని, దానికి మరో ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు.