: ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణ రేపటికి వాయిదా
ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్ధమంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదావేసింది. ఈ మధ్యాహ్నం కోర్టులో వాదనలు ప్రారంభం కాగా, సర్వీసు నిబంధనలపై వివరాలు తెలపాలని హైకోర్టు ఏపీఎన్జీవోలను కోరింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.