: ఆ యాసిడ్ దాడి నాటకమట..!?


ఈనెల 2న అనంతపురం జిల్లా శివార్లలో ఓ యువతిపై యాసిడ్ దాడి ఓ నాటకమని పోలీసులు తేల్చారు. ప్రియుడిపై ద్వేషంతోనే యువతి ఇలా చేసినట్లు వెల్లడించారు. ఎన్.వాణి అనే యువతి, ఓ వ్యక్తి ప్రేమించుకున్నారు. అయితే, ఆ వ్యక్తి వేరే వివాహం చేసుకోవడంతో అతడిని వాణి నిలదీసింది. దాంతో, ఆగ్రహం చెందిన వ్యక్తి ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడని, వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై వెంటనే విచారణ జరిపిన డీఎస్పీ కేసును నిగ్గు తేల్చి నాటకం విషయాన్ని తెలిపారు.

  • Loading...

More Telugu News