: హరీశ్ రావు, కేటీఆర్ లకు మతి భ్రమించింది: జయప్రకాశ్ రెడ్డి


టీఆర్ఎస్ నేతలపై సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇవ్వడంతో టీఆర్ఎస్ నేతలకు పనిలేకుండా పోయిందని విమర్శించారు. దీంతో మతిభ్రమించిన హరీశ్ రావు, కేటీఆర్ ఏం చేయాలో తెలియక సీఎంను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇకపై ముఖ్యమంత్రిని టీఆర్ఎస్ నేతలు ఒకసారి తిడితే... తాను వారిని రెండుసార్లు తిట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమాలు చేపట్టి, సీమాంధ్రలో పర్యటిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News