: ఢిల్లీలో ధర్నా చేయనున్న సచివాలయ ఉద్యోగులు
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఈనెల 27న ఢిల్లీలో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా చేపట్టనున్నారు. ఈ నెల 27న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతామని, ఈ నెల 26 నుంచి 29 వరకు ఢిల్లీలో వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తామని సీమాంధ్ర ఉద్యోగుల సంఘం తెలిపింది.