: ముగిసిన ఖైరతాబాద్ బొజ్జగణపయ్య నిమజ్జనం
బొజ్జగణపయ్య కోటివరాల జల్లు కురిపించి సెలవు తీసుకున్నాడు. నిన్న సాయంత్రం ప్రారంభమైన గణేశుడి శోభయాత్ర నేడు ముగిసింది. వేలాదిమంది భక్తుల సాక్షిగా గోనాగ చతుర్ముఖ గణనాయకుడు ఈ ఏడాదికి వీడ్కోలు తీసుకున్నాడు. బొజ్జ గణపయ్య వెళ్లి రావయ్యా అంటూ భక్తుల జయజయధ్వానాల నడుమ, పండితుల వేద మంత్రాల మధ్య ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం పూర్తిచేశారు. 59 అడుగుల భారీ చతుర్ముఖ వినాయకుడిని భారీ క్రేన్ సాయంతో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. గణేశుడి నిమజ్జనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది.