: రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ పై టీడీపీ ఎంపీ ఫిర్యాదు
రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ పై టీడీపీ పార్లమెంటు సభ్యుడు వేణుగోపాల్ రెడ్డి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్ కు బుధవారం ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల కిందట రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో బ్యాలెట్ బాక్సు ద్వారా ఓటుహక్కు వినియోగించుకునేందుకు భన్వరలాల్ తనకు అవకాశం ఇవ్వలేదని వేణుగోపాల్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చినందున తనకు ఆ అవకాశం ఇవ్వాలని కోరినట్లు, ఆయన తిరస్కరించినట్టు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.