: తెలంగాణ మంత్రుల తీరు తలదించుకునేలా ఉంది: కోమటిరెడ్డి


మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తెలంగాణ మంత్రులపై విరుచుకుపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ మంత్రులు తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ మంత్రులు క్యాబినెట్ సమావేశాన్ని బహిష్కరించాలని సూచించారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, సీడబ్ల్యూసీ ప్రకటన వచ్చి నెలన్నర రోజులు దాటుతున్నా, నోట్ క్యాబినెట్ ముందుకు రాకపోవడం సందేహాలకు తావిస్తోందన్నారు. 2009 నాటి పరిణామాలను మరోసారి చవిచూడాల్సి వస్తుందేమోనని ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచేందుకు తెలంగాణ మంత్రులు పదవులకు రాజీనామాలు చేయాలని, లేకుంటే వారి నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News