: భారత్-ఎ జట్టుకు 'భారీ' సవాల్
విండీస్-ఎ జట్టుతో మూడో వన్డేలో భారత్-ఎ జట్టు ముంగిట భారీ సవాల్ నిలిచింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగుల భారీ స్కోరు సాధించింది. కిర్క్ ఎడ్వర్డ్స్ (104) సెంచరీతో భారత బౌలర్ల పనిబట్టాడు. వన్డే సిరీస్ గెలవాలంటే భారత్-ఎ ఈ పరుగుల సవాల్ ను అధిగమించకతప్పదు. ఈ నేపథ్యంలో భారత్-ఎ బ్యాట్స్ మెన్ ఎలా స్పందిస్తారో చూడాలి. యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, యూసుఫ్ పఠాన్, ఉన్ముక్త్ చాంద్, మన్ దీప్ సింగ్ ల బ్యాటింగ్ పాటవానికి లక్ష్యఛేదనలో పరీక్ష తప్పదనిపిస్తోంది. కాగా, ఈ మూడు వన్డేల సిరీస్ లో ఇరు జట్లు చెరో వన్డే గెలిచాయి.