: హోంమంత్రి షిండేకు క్లీన్ చిట్


సంచలనం సృష్టించిన ముంబయి ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదే విషయాన్ని సీబీఐ బాంబే హైకోర్టుకు తెలిపింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో బినామీ పేరుమీద షిండే దక్షిణ ముంబయిలోని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో ఓ ఫ్లాట్ కలిగి ఉన్నట్లు ఆరోపిస్తూ ప్రవీణ్ వట్గోంకర్ అనే సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు షిండేపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీని ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News