: జపాన్ ఓపెన్ లో ముగిసిన సింధు పోరాటం


జపాన్ ఓపెన్ బ్యాండ్మింటన్ టోర్నీలో తెలుగుతేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. సింధు జపాన్ షట్లర్ యమగుచి చేతిలో 6-21 17-21 తేడాతో ఓటమిపాలైంది. తొలి సెట్లో ప్రత్యర్థికి సులభంగా లొంగిపోయిన సింధు మలి సెట్లో పుంజుకుంది. అయినప్పటికీ కీలక సమయాల్లో తప్పులు చేయడంతో సింధు పోరాటం ముగిసింది. దీంతో పీవీ సింధు క్వార్టర్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. మరోవైపు, మెన్స్ సింగిల్స్ లో భారత పురుషులు ముందంజ వేశారు. అజయ్ జయరాం, శ్రీకాంత్ క్వార్టర్స్ లో అడుగుపెట్టారు.

  • Loading...

More Telugu News