: స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ క్షేత్రస్థాయి సమావేశాలు


స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి సమావేశాలు నిర్వహించి శ్రేణులను సన్నద్ధం చేయాలని నిర్ణయించింది. మార్చి 1,2 తేదీల్లో జరిగే ఈ సమావేశాలను జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో నిర్వహించబోతున్నారు.

వీటి తర్వాత అదే నెలలో 4,5,6,7 తేదీల్లో పార్టీ మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశాలు కూడా జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిలో స్థానిక ఎన్నికలకు సమాయత్తమవ్వాల్సిన విధానం.. సహకార, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై విశ్లేషణ, ఇతర ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రధానంగా చర్చించనున్నారు.  

  • Loading...

More Telugu News