: ఉమ్మడి రాష్ట్రం వల్లే ఉగ్రవాదం పెచ్చరిల్లింది: కోదండరాం
రాష్ట్రం ఉమ్మడిగా ఉండడం వల్లే ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అసమర్థ విధానాలే ప్రస్తుత పరిస్థితికి దారితీశాయని కోదండరాం విమర్శించారు. బాంబు పేలుళ్ల ఘటనపై వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికారంలో కొనసాగే హక్కు ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో మహిళలకు ప్రత్యేక జేఏసీ ఏర్పాటు చేయనున్నామని కోదండరాం వెల్లడించారు. బాంబు పేలుళ్ల ఘటన కారణంగా వాయిదా పడిన సడక్ బంద్, చలో అసెంబ్లీ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.