: నేవీ యార్డ్ మృతుల స్మారక సభకు ఒబామా


వాషింగ్టన్ లోని నేవీ యార్డ్ కాల్పుల ఘటనలో చనిపోయిన వారి స్మారకార్థం... ఆదివారం ఏర్పాటు చేయనున్న స్మారక సభకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రతినిధి వెల్లడించారు. ఈ సందర్భంగా దుండగుల దుశ్చర్యలపై ఒబామా ప్రసంగిస్తారని తెలిపారు. యూఎస్ అధ్యక్ష భవనానికి దగ్గర్లోనే ఉన్న నేవీ యార్డ్ లో సైనిక దుస్తుల్లో ప్రవేశించిన ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటన తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఓ భారత సంతతి అధికారి సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News