: తెలంగాణపై కాంగ్రెస్ సానుకూలంగా ఉందో లేదో చెప్పలేను: అజిత్ సింగ్
తెలంగాణపై కాంగ్రెస్ సానుకూలంగా ఉందో లేదో తాను చెప్పలేనని ఆర్ఎల్ డీ అధ్యక్షుడు, పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ అన్నారు. అయితే, మంగళవారం జరిగిన యూపీఏ సమన్వయ కమిటీ భేటీలో తెలంగాణ అంశంపై చర్చ జరిగిందని మంత్రి తెలిపారు. కానీ, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎప్పటిలోగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామో మాత్రం చెప్పలేనని అజిత్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో మాట్లాడిన ఆయన ఈమేరకు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.