: మా ప్రయత్నం వల్లే తెలంగాణ నోట్ ఇంకా పూర్తికాలేదు: పురందేశ్వరి
కేంద్రం తెలంగాణ నోట్ ను ప్రస్తుతానికి పక్కనబెట్టినట్టే అని కేంద్ర మంత్రి పురందేశ్వరి చెబుతున్నారు. సీమాంధ్ర మంత్రుల ప్రయత్నం వల్లే కేంద్రం తెలంగాణ నోట్ ను ఇంతవరకు పూర్తి చేయలేదని తెలిపారు. తమ నిరంతర ప్రయత్నాలతో రాష్ట్ర విభజన ప్రక్రియ మందగించిందని ఆమె తెలిపింది. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ పురందేశ్వరి ఈ విషయాలు వెల్లడించారు.