: సమైక్యాంధ్రకు మద్దతుగా కోటి సంతకాల సేకరణ
సమైక్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభిస్తున్నట్టు మాథ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రకు అన్ని అన్ని రంగాల్లో నష్టం వాటిల్లుతుందని, దాని కారణంగా విభజన ప్రక్రియ తక్షణం ఆపేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ నెల 21న కానూరు సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.