: కందురతా నిష్క్రమణ!


చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ మెయిన్ డ్రాలో చోటు దక్కించుకోవాలనుకున్న కందురతా మెరూన్స్ ఆశలు ఆవిరయ్యాయి. అర్హత పోటీల్లో వరుసగా రెండో ఓటమితో టోర్నీ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన ఈ శ్రీలంక దేశవాళీ జట్టు ఈ సాయంత్రం ఒటాగో వోల్ట్స్ తో మ్యాచ్ లోనూ అదేబాటలో పయనించింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కందురతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్ తరంగ 76 పరుగులు చేశాడు. ఒటాగో బౌలర్ బట్లర్ నాలుగు బంతుల్లో మూడు వికెట్లు తీయడం విశేషం.

అనంతరం లక్ష్యఛేదనలో ర్యాన్ టెన్ డష్కాటె (32 బంతుల్లో 64; 2 ఫోర్లు, 5 సిక్సులు) వీరవిహారం చేయడంతో ఒటాగో మరో రెండు ఓవర్లు మిగిలుండగానే విజయదుందుభి మోగించింది. డష్కాటెకు తోడు నీషామ్ (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా బ్యాట్ ఝుళిపించడంతో ఒటాగో 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కాగా, నిన్న ఫైసలాబాద్ వోల్వ్స్ పై నెగ్గిన ఒటాగో తాజా విజయంతో మెయిన్ డ్రాలో దాదాపు చోటు ఖరారు చేసుకుంది!

  • Loading...

More Telugu News