: డీజీపీ ఆస్తులపై సీబీఐ విచారణ ప్రారంభం
డీజీపీ దినేష్ రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణ మొదలైంది. ఈ మేరకు వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. డీజీపీ అక్రమాస్తులు కూడబెట్టారంటూ ఐపీఎస్ అధికారి ఉమేశ్ కుమార్ పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. అంతేగాక పిటిషన్ లో పేర్కొన్న ఆరోపణలపై ఇరువురు అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు నాలుగు రోజుల కిందట ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ విచారణ నెలలోగా పూర్తి చేయాలని చెప్పింది.