: రికార్డు ధర పలికిన అమీర్ పేట్ లడ్డూ


గణేష్ నిమజ్జన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దీంతో పలు చోట్ల వినాయకుడికి భక్తులు సమర్పించిన లడ్డూలను వేలం వేశారు. ఈ వేలం రసవత్తరంగా సాగింది. విఘ్నేశ్వరుడి లడ్డూలను చేజిక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. దీంతో లడ్డూల ధరలు వందల నుంచి వేలకు, వేల నుంచి లక్షలకు చేరుకున్నాయి. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లడ్డూ రికార్డు ధరకు అమ్ముడు పోయింది. దీన్ని 12 లక్షల వెయ్యినూట పదహార్లకు వీవీఆర్ హౌసింగ్ సంస్థ సీఈవో బీఎస్ఎన్ మూర్తి దక్కించుకున్నారు. ఆ తరువాతి స్థానం బాలాపూర్ గణేశుడిది. ఈ లడ్డూను మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి రూ.9.26 లక్షలకు దక్కించుకున్నారు. ఆ తరువాత స్థానం అత్తాపూర్ గణేశుడిదే ఇది 3.25 లక్షల రూపాయలు పలికింది.

  • Loading...

More Telugu News