: అభియోగాల నమోదుకు జగన్ న్యాయవాది అభ్యంతరం
అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున అభ్యంతరాలు నమోదు చేయరాదని జగన్ న్యాయవాది ఈరోజు సీబీఐ కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో అభియోగాలు నమోదు చేస్తే జగన్ కు నష్టం వాటిల్లుతుందని ఆయన వాదించారు.
అయితే, అభియోగాలు నమోదు చేస్తే ఎలాంటి నష్టం వాటిల్లుతుందని కోర్టు తిరిగి ప్రశ్నించింది. ఈ క్రమంలో అభియోగాలు నమోదు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు సీబీఐ అధికారులు కోర్టుకు విన్నవించారు. దీంతో, అభియోగాల నమోదుపై సీబీఐ కోర్టు మార్చి 13న నిర్ణయం తీసుకోనుంది.