: రెండు లక్షల విలువ చేసే పేలుడు పదార్థాలు స్వాధీనం
నెల్లూరు జిల్లా డక్కిలి మండల పరిధిలోని వెంకటగిరి-రావూరు మార్గంలో అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా నుంచి వాహనంలో తరలిస్తున్న ఈ పేలుడు పదార్థాల విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనావేశారు. వాహనంతో పాటు డ్రైవర్ సునీల్, మరో నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.