: ఆ రేసులో అద్వానీ లేరు: వెంకయ్య
బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ విషయమై మరో అగ్రనేత వెంకయ్య నాయుడు స్పందించారు. అద్వానీ ప్రధాని రేసులో లేరని వెంకయ్య స్పష్టం చేశారు. ఢిల్లీలో అద్వానీని ఈ ఉదయం కలిసిన అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడారు. తాను ప్రధాని రేసులో లేనని అద్వానీ ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారు. ఆయన వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో చురుగ్గా పాల్గొంటారని, ఎప్పట్లాగే పార్టీకి మార్గదర్శనం చేస్తారని చెప్పారు. కొద్దిరోజుల క్రితం మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై కినుక వహించిన అద్వానీ, ఆ తర్వాత మెత్తబడ్డారు. మోడీకి మద్దతుగా మాట్లాడారు.