: ఎన్ డీఏ తో పొత్తు పెట్టుకుంటాం: యడ్యూరప్ప
బీజేపీని వీడి కర్ణాటక జనతా పార్టీ (కెజిపి) పేరిట వేరుకుంపటి పెట్టుకున్న యడ్యూరప్ప కమలనాథుల ఆధ్వర్యంలోని ఎన్ డీఏ తో పొత్తు పెట్టుకుంటామని తెలిపారు. అంతేకాని తన పార్టీని బీజేపీలో కలిపే సమస్యేలేదని తేల్చి చెప్పారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఏన్ డీఏతో సీట్లు పంచుకుంటామన్నారు. అంతేగాకుండా, ఏన్ డీఏ ఎన్నికల ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తామని తెలిపారు. మోడీతో మంచి సంబంధం ఉన్న యెడ్డీ బీజేపీలో తిరిగి చేరుతున్నారని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలతో ఆయన కాషాయదళంలోకి తిరిగి వెళ్లరని స్పష్టమైంది.