: ప్రభుత్వం ఉన్నది ఉల్లిపాయలు అమ్మడానికి కాదు: కపిల్ సిబల్


ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే కేంద్ర మంత్రి కపిల్ సిబల్ మరోసారి వింతైన వ్యాఖ్యలు చేశారు. ఉల్లిపాయల ధర పెరిగితే వ్యాపారులను అడగాలి కాని... మమ్మల్ని అడిగితే ఎలా? అని ప్రశ్నించారు. అంతే కాదు... ప్రభుత్వం ఉన్నది ఉల్లిపాయలు అమ్మడానికి కాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదంటూ కేంద్ర మంత్రివర్యులు నిస్సిగ్గుగా మాట్లాడారు. గతంలో, ఉల్లి ధర పెరిగితే రైతులకు మంచిదేగా అని వ్యాఖ్యానించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తీవ్ర విమర్శలనెదుర్కొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News