: మంత్రి కాదు.. దేవుడు!


కొందరు తమ పక్కన ఎంతటి ఉపద్రవం చోటుచేసుకున్నా స్పందించరు. మరికొందరైతే, ప్రేక్షకుల్లా చూడ్డానికి పరిమితమవుతారే తప్ప ఆపదల్లో ఉన్నవారిని రక్షించేందుకు సాహసించరు. కానీ, ఈ కర్ణాటక మంత్రి మాత్రం సూపర్ హీరో అనిపించుకున్నారు. నీటిలో మునిగిపోతున్న ఓ కుటుంబాన్ని రక్షించి అందరి ప్రశంసలకు పాత్రులయ్యారు. వివరాల్లోకెళితే.. కర్ణాటక ప్రాథమిక, ఉన్నత విద్యాశాఖ మంత్రి రత్నాకర్ కిమ్మన వాహనంలో బెంగళూరు నుంచి స్వగ్రామం తీర్థహళ్ళి వెళుతున్నారు. మార్గమధ్యంలో బెగువల్లి వద్ద చెరువులో మారుతి స్విఫ్ట్ కారు మునిగిపోతుండడం గమనించిన మంత్రి వెంటనే తన వాహనాన్ని ఆపారు. అంగరక్షకులతో కలిసి పరుగుపరుగున వెళ్ళి చెరువులో దూకారు. ప్రాణాలకు తెగించి ఆ కారులో ఉన్న ఆరుగురినీ రక్షించారు.

తొలుత కారు రియర్ డోర్ తెరిచి లోపల ఉన్న ముగ్గురు చిన్నారులను మంత్రి బయటికి తీసుకొచ్చారు. అనంతరం మళ్ళీ నీటిలో దిగి కారులో ఉన్న పెద్దావిడ సహా మరో ఇద్దరినీ రక్షించారు. ఆ కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా, మంత్రికి ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఆయన సకాలంలో అక్కడికి రాకపోతే తమ ప్రాణాలు పోయేవని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News