: సచివాలయ పరిసరాల్లో ర్యాలీలు, సభలపై ఆంక్షలు
సమైక్య, తెలంగాణ వాదుల పోటాపోటీ ఆందోళనలతో అట్టుడుకుతున్న సచివాలయం పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు, సభలను నిషేధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ప్రకటించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి నవంబరు 18 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఇరు ప్రాంత జేఏసీలు సభలకు, ర్యాలీలకు సిద్ధమవుతుండటంతో... ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.