: చివరిసారి ప్రజలకు దర్శనమిచ్చిన పోప్ బెనడిక్ట్-16
తన చివరి అధికారిక హోదాలో పోప్ బెనడిక్ట్-16 ఈ రోజు వాటికన్ లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో ప్రజలకు దర్శనమిచ్చారు. ఓ ప్రత్యేక వాహనంలో నిలుచున్న పోప్ ను వీక్షించి, ఆశీస్సులందుకునేందుకు దాదాపు లక్షమంది వాటికన్ ప్లాజాకు పోటెత్తారు. అనారోగ్య కారణాలతో పోప్ పదవికి రాజీనామా ప్రకటించిన బెనడిక్ట్-16 రేపు అధికారికంగా బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. అయితే, ఆయన గౌరవ పోప్ గా కొనసాగనున్నారు.