: నిండు కుండలా ప్రకాశం బ్యారేజ్


భారీగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం జలకళను సంతరించుకుంది. నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ నిండు కుండలా మారింది. దీంతో ఈ రోజు ఉదయం 70 గేట్లను ఎత్తేసి 50,750 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. మరోవైపు, సాగర్ నుంచి లక్షా 70 వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. దీంతో, రేపు ఉదయానికల్లా మొత్తం గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News