: కలుపు తీసిన ఏపీఎన్జీవోలు, న్యాయవాదులు


కృష్ణా జిల్లా నందిగామలో ఏపీఎన్జీవోలు, న్యాయవాదులు వినూత్న నిరసన తెలిపారు. స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ కొందరు రాష్ట్రంలో కలుపు మొక్కల్లా తయారయ్యారంటూ పొలంలో కలుపుతీసి నిరసన తెలిపారు. స్వార్థ ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడం సరికాదంటూ నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులు, సీమాంధ్ర నాయకులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విభజన వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని అన్నారు.

  • Loading...

More Telugu News