: గీతారెడ్డి రాజీనామా చేయాలి: సీపీఐ నారాయణ


వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో దాఖలైన ఛార్జ్ షీట్లో మంత్రి గీతారెడ్డి పేరు కూడా చోటు చేసుకోవడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పందించారు. గీతారెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు వచ్చాక పదవిలో కొనసాగే హక్కు ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి రాజీనామా చేశారని నారాయణ గుర్తుచేశారు. ఇందూ-లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూ కేటాయింపుల వ్యవహారంలో నిన్న రెండు ఛార్జీషీట్లు దాఖలు చేసిన సీబీఐ లేపాక్షి వ్యవహారంలో మంత్రి గీతారెడ్డి పేరును పేర్కొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News