: ఫైసలాబాద్ తో ఢీకి ధావన్ సేన రెడీ


చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ అర్హత పోటీల్లో భాగంగా నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు పాకిస్తాన్ దేశవాళీ జట్టు ఫైసలాబాద్ వోల్వ్స్ తో ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కు మొహలీ వేదిక. రాత్రి 8 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు ముందు కందురతా మెరూన్స్, ఒటాగో వోల్ట్స్ ఇదే మైదానంలో సాయంత్రం 4 గంటలకు తలపడతాయి. కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 8 వికెట్ల తేడాతో కందురత జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కందురత నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఆ జట్టులో సంగక్కర (61 నాటౌట్), కెప్టెన్ తిరిమన్నె (54) రాణించారు. లక్ష్యఛేదనలో ఓపెనర్లు కెప్టెన్ శిఖర్ ధావన్ (71), పార్థివ్ పటేల్ (52) అదరగొట్టడంతో.. భారత్ 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలుపుతీరాలకు చేరింది. విన్నింగ్ షాట్ గా తిస్సర పెరీరా (11 బంతుల్లో 32) సిక్స్ కొట్టడం విశేషం.

  • Loading...

More Telugu News