: నిమజ్జనానికి 59 భారీ క్రేన్లు: జీహెచ్ఎంసీ కమిషనర్


వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు తెలిపారు. వేలాది సంఖ్యలో తరలివచ్చే గణనాథులను నిమజ్జనం చేయడానికి మొత్తం 59 భారీ క్రేన్లు, 71 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిమజ్జనాన్ని చూడ్డానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లు తగిన చర్యలు తీసుకుంటాయని ఆయన తెలిపారు. దీనికి తోడు మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రమాదవశాత్తు నీటిలో పడినవారిని రక్షించేందుకు 85 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశామని కృష్ణబాబు తెలిపారు. ఈ రోజు దాదాపు 40 వేల వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. రేపు ఉదయం 9 గంటల కల్లా నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News