: శ్రీవారి నూతన పాదాల ప్రతిష్ఠాపన


తిరుమల నారాయణగిరి పర్వత శ్రేణుల్లోని శ్రీవారి పాదాల మంటపంలో నూతన పాదాల ప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. ఈ రోజు ఉదయం మీన లగ్నంలో వేద మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో, జేఈవో పాల్గొన్నారు. సోమవారం వరకు ఈ పనులు కొనసాగనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా శ్రీవారి పాదాల పరిరక్షణ కోసం గాజుతో రూపొందించిన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పనులు ముగిసేంతవరకు భక్తులను శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి అనుమతించబోమని తెలిపారు.

  • Loading...

More Telugu News