: టెస్టుల్లో నాలుగో ర్యాంకుకు ఎగబాకిన భారత్


ఆస్ట్రేలియాపై టెస్టు విజయంతో భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ రోజు ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ టీమ్ విభాగంలో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను కిందకినెట్టి నాలుగో స్థానం చేరింది. ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకెళుతున్న దక్షిణాఫ్రికా అగ్రపీఠం పదిలపర్చుకోగా, తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్ ఉన్నాయి.

ఇక బ్యాటింగ్ ర్యాంకుల్లో సచిన్ టెండూల్కర్ 3 స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానానికి చేరుకున్నాడు. కాగా, చెన్నయ్ టెస్టులో ఆసీస్ పై 12 వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ (11) కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. 

  • Loading...

More Telugu News