: బాలాపూర్ లడ్డూ రేటే వేరు!
ఈ ఏడాది వేలంపాటలో బాలాపూర్ లడ్డూని తెలుగుదేశం నేత తీగల కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. వేలం పాటలో పాల్గొన్న ఆయన రూ. 9.26 లక్షలకు లడ్డూని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేలంలో బాలాపూర్ గణనాథుని లడ్డూని సొంతం చేసుకోవడం చాలా గర్వంగా ఉందని అన్నారు. లడ్డూని టీడీపీ అధినేత చంద్రబాబు తదితరులకు పంపిణీ చేస్తానని చెప్పారు. పోయిన ఏడాది బాలాపూర్ లడ్డూ రూ. 7.50 లక్షలు పలికింది.